తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘించిన వైన్​షాపులు సీజ్​ - jogulamba gadwal district news

జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు మండలాల్లో రెండు రోజులుగా వైన్​షాపులపై టాస్క్​ఫోర్స్, ఎన్​ఫోర్స్​మెంట్​​ అధికారులు దాడులు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు వైన్​షాపులపై కేసులు నమోదు చేసి సీజ్​ చేశారు.

wine shops siezed in jogulamba gadwal district
నిబంధనలు ఉల్లంఘించిన వైన్​షాపులు సీజ్​ చేసిన అధికారులు

By

Published : May 29, 2020, 12:21 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, మల్దకల్, ధరూర్ మండలాల్లో ఉన్న వైన్ షాపులపై ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు గత రెండు రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం టాస్క్​ఫోర్స్ బృందం, ఇతర బృందాలు గద్వాల పీఎస్​ పరిధిలో గల వైన్​ షాపుల్లో సోదాలు జరిపారు. నిబంధనలు ఉల్లఘించిన ఆయా వైన్​షాపుల మీద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

అలాగే బుధవారం కూడా పలు వైన్​షాపులపై సోదాలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన ఐదు మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి సీజ్​ చేసినట్లు ఎక్సైజ్​ అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details