జోగులాంబ గద్వాల్ జిల్లాలో కందులను కొనాలని అలంపూర్ చౌరస్తా 44వ నంబర్ జాతీయ రహదారిపై రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. రైతుల విషయంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
'మిగితా పంటను ఎక్కడ అమ్ముకోవాలి' - జోగులాంబ గద్వాల్ జిల్లా వార్తలు
కందులు కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ 44వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కందులు కొంటామని చెప్పిన అధికారులు మార్కెట్కు తీసుకొచ్చాక ఎకరాకు 2 కింటాళ్లే కొంటున్నారని మిగితా పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు.
'మిగితా పంటను ఎక్కడ అమ్ముకోవాలి'
కందులు కొంటామని చెప్పిన అధికారులు రైతులు మార్కెట్కు తీసుకొచ్చాక ఎకరాకు 2 కింటాళ్లే కొంటామంటే మిగితా పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. మార్కెట్లో రైతులకు సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. సంఘటన స్థలం నుంచే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే రైతుల దగ్గరున్న కందులు మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం