తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్డీఎస్ కాల్వకు గండి.. వృథాగా పోతున్న నీరు

ఆర్డీఎస్ కాల్వలను ఆధునీకరించకపోవడం వల్ల జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం జులకల్​ శివాలయం వద్ద కాలువ​కు గండి పడింది.

జోగులాంబ

By

Published : Aug 15, 2019, 8:00 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ ఎత్తిపోతల పథకం ద్వారా బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్డీఎస్ కాల్వకు నీటిని విడుదల చేశారు. కాల్వలను ఆధునీకరించకపోవడం వల్ల జులకల్​ శివాలయం వద్ద ఆర్డీఎస్ కెనాల్​కు గండి పడింది. కాల్వ తెగిపోవడం వల్ల నీరు వృథాగా పొలాల్లోకి పారుతోంది. ఆర్డీఎస్ కాల్వలో పూడిక తీయకపోవడం వల్ల నీరు ముందుకు పోవడం లేదని.. అందువల్లే కాల్వ తెగిపోయిందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని బాగుచేయాలని డిమాండ్ చేశారు.

ఆర్డీఎస్ కాల్వకు గండి

ABOUT THE AUTHOR

...view details