జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ శ్రుతి ఓజా పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కలెక్టర్‌లోని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కార్యాలయానికి వెళ్లిన శాఖ సహాయ సంచాలకులు రమేశ్... హరితహారంలో కనీసం ప్రోటోకాల్ పాటించలేదని అడిగారు. ఇంతలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిందని, అది కాస్త చేతల వరకు పోయి... తన తలపై దాడి చేశారని డా. రమేశ్ తెలిపారు.
ప్రోటోకాల్ పాటించక ఘర్షణ.. గాయపడ్డ పశుసంవర్ధక అధికారి - two veterinary doctors pandemonium on protocol issue
ప్రోటోకాల్ వివాదం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా. రమేశ్‌కు గాయాలయ్యాయి.
![ప్రోటోకాల్ పాటించక ఘర్షణ.. గాయపడ్డ పశుసంవర్ధక అధికారి veterinary doctors pandemonium at gadwal district collectorate on protocol issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7974167-thumbnail-3x2-mbnr.jpg)
ప్రోటోకాల్ తెచ్చిన ఘర్షణ... గాయపడ్డ పశుసంవర్ధక శాఖ అధికారి
'కేవలం ప్రోటోకాల్ గురించి అడిగినందుకే జిల్లా అధికారి తన టేబుల్‌పై ఉన్న షీల్డ్‌తో తలపై దాడి చేశాడని, వెంటనే సిబ్బంది తనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారని, అనంతరం జిల్లా అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్ల్‌లో ఫిర్యాదు చేశానని డా. రమేశ్ పేర్కొన్నారు.