జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా పాలనాధికారికి ముందుగా ఈవో, ఆలయ సిబ్బంది, అర్చకులు ఘనస్వాగతం పలికారు. కలెక్టర్ కుటుంబం ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి అమ్మవారి చీర, గాజులు.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.
జోగులాంబ సన్నిధిలో వనపర్తి కలెక్టర్ - jogulamba
శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
వనపర్తి కలెక్టర్