జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం - జూరాల జలాశయం తాజా వార్తలు
08:02 August 19
జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం
జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. కర్ణాటక కురువపురానికి చెందిన పార్వతమ్మ, సుమలతగా గుర్తించారు. ఈనెల 17న మక్తల్ మండలం పంచదేవుపాడు వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగింది.
ఆ ఘటనలో కర్ణాటక కురువపురానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురం వెళ్తుండగా కృష్ణా నదిలో పుట్టి మునిగింది. గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చూడండి :తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా కేసులు, 8 మరణాలు