తుంగభద్ర పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయి. ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తిక సోమవారం... కార్తిక పౌర్ణమి కావడంతో వేకువ జాము నుంచే భక్తుల సందడి నెలకొంది. నదిలో పుణ్య స్నానాలు ఆచరించి... కార్తీక దీపాలు వదులుతున్నారు.
తుంగభద్ర పుష్కరాలకు పోటెత్తిన భక్తులు - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతోన్న తుంగభద్ర పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయి. కార్తిక పౌర్ణమి కావడంతో భక్తులు తరలివచ్చారు. నదిలో పుణ్య స్నానాలు ఆచరించి... కార్తిక దీపాలు వదులుతున్నారు.
తుంగభద్ర పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
స్వామి, అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. నాలుగు ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఇదీ చదవండి:నేను భాజపాలో చేరుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: హరీశ్‌రావు