జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో తుంగభద్ర పుష్కరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నాల్గో రోజు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కార్తిక మాసం... అందులో శివునికి ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి నదిలో వేకువ జామునే పుణ్య స్నానాలు ఆచరించారు. ఘాట్ సమీపంలో కార్తిక దీపాలు వెలిగించి నదీమ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. కార్తిక దీపాల వెలుగులో తుంగభద్ర నది వెలుగులీనుతోంది.
నాల్గో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు - జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు
తుంగభద్ర నది పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వేకువ జామునే పుణ్యస్నానమాచరించి కార్తిక దీపాలని వెలిగించారు. కార్తిక దీపాలతో నదీమ తల్లి కళకళలాడుతోంది.
నాల్గో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు
కొంత మంది భక్తులు తమ పెద్దలకు సంకల్పం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:శోభాయమానంగా తుంగభద్ర నదీమ పుష్కర హారతి