గద్వాల
గద్వాల మున్సిపాలిటీలో తెరాసకు స్పష్టమైన అధిక్యం ఉండటం వల్ల ఛైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా బీఎస్ కేశవ్, వైస్ ఛైర్మన్‌గా బాబర్ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
అలంపూర్
అలంపూర్ పురపాలికలో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా మనోరమ, వైస్ ఛైర్మన్‌గా శేఖర్ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
అయిజ
అయిజ పురపాలికలో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. తెరాస-6, కాంగ్రెస్-4 ఫార్వర్డ్ బ్లాక్ -10 స్థానాలు గెలుచుకోగా.... ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు తెరాస ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. అయిజ మున్సిపల్ ఛైర్మన్‌గా దేవన్న, వైస్ ఛైర్మన్‌గా నరసింహులు తెరాస అభ్యర్థులు ఎన్నికయ్యారు.
వడ్డేపల్లి
వడ్డేపల్లి పురపాలికలో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వడ్డేపల్లిలో 10 స్థానాలకు 8 కాంగ్రెస్ గెలుచుకుంది. మున్సిపల్ ఛైర్పర్సన్గా కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ఎస్ కరుణ, వైస్ ఛైర్పర్సన్ఘా సుజాత ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
బస్తీకా బాద్షా: జోగులాంబలో మూడు తెరాస, ఒకటి కాంగ్రెస్