జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో తెరాస ... పుర ఎన్నికల ప్రచారజోరు పెంచింది. అలంపూర్‌లోని 1,2,3 వార్డుల్లోని అభ్యర్థులకు మద్దతుగా తెరాస ఎమ్మెల్యే వి.ఎం. అబ్రహం ప్రచారంలో పాల్గొన్నారు.
'తెరాసను ఆదరించి... కారు గుర్తుకు ఓటు వేయండి'
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని తెరాస ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని మూడు పురపాలికల్లో ఇంటింటికి వెళ్లి తెరాస అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించారు.
అలంపూర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
కాలనీవాసులు వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సారించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నందున ఏ సమస్య వచ్చినా... త్వరగా పరిష్కారమవుతుందని అబ్రహం భరోసా ఇచ్చారు. ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున తెరాసను ఆదరించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.