నేటితో తుంగభద్ర పుష్కరాలు పదో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కావడంతో పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. అలంపూర్ పుష్కర ఘాట్ వద్ద తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొనగా 6 వేలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.
పదో రోజు పుష్కరాలు.. ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు
జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటితో పుష్కరాలు ప్రారంభమై పది రోజులు కాగా ఈ రోజు ఆదివారం కావడంతో పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. అలంపూర్ పుష్కర ఘాట్‌లో తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకు ఆరువేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు.
పదో రోజు పుష్కరాలు.. ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు
భక్తులు నదిలో కార్తిక దీపాలు వదులుతూ పూజలు చేస్తున్నారు. సంకల్పం చేస్తూ పూర్వీకులకు పిండప్రదానాలు చేస్తున్నారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఇదీ చదవండి:తెరాస, ఎంఐఎం, భాజపా ఒక్కటే.. : ఉత్తమ్