ఆదివారం మూడో రోజూ తుంగభద్ర పుష్కరాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. అలంపూర్, పుల్లూరు, రాజోలి, వేణి సోంపూర్ ఘాట్లకు పెద్ద మొత్తంలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సుమారు 28వేల మంది భక్తులు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు 8 వేలు, రెండో రోజు 16 వేల మంది రాగా.. ఆదివారం కావడం వల్ల ఎక్కువ మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే తాకిడి మొదలైంది. ఘాట్ల వద్ద అధికారులు మంచినీరు, మౌలిక వసతులు కల్పించారు. అటు వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు భక్తులకు తమ వంతు సేవలు అందించారు.
మూడో రోజూ తుంగభద్ర పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
మూడో రోజూ తుంగభద్ర పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అలంపూర్, పుల్లూరు, రాజోలి, వేణి సోంపూర్ ఘాట్లలో రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచే ఘాట్లు, ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.
మూడో రోజూ తుంగభద్ర పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
వృద్ధులు ఘాట్ల వద్ద స్నానాలకు వెళ్లేందుకు సాయం చేశారు. జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నదిలో నీటిని శుభ్రపరిచారు. ప్లాస్టిక్ వ్యర్తాలను తొలగించారు. జోగులాంబ గద్వాల ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ నాలుగు ఘాట్లను సందర్శించి శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను పర్యవేక్షించారు. వేణి సోంపూర్ ఘాట్‌లో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడో రోజూ అలంపూర్ ఘాట్ వద్ద వేద మంత్రోచ్ఛరణల నడుమ నదీమ తల్లికి గంగాహారతి నిర్వహించారు.
Last Updated : Nov 22, 2020, 9:06 PM IST