తెలంగాణ

telangana

ETV Bharat / state

భర్త వేధింపులు తాళలేక కత్తిపీటతో గొంతుకోసుకుని భార్య మృతి - జోగులాంబ గద్వాల జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక మహిళ కత్తిపీటతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ధరూర్​ మండలంలో జరిగింది. భర్త మాటలతో మనస్తాపం చెంది బలవణ్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

భర్త వేధింపులు తాళలేక కత్తిపీటతో గొంతుకోసుకుని భార్య మృతి

By

Published : Nov 4, 2019, 9:05 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్​ మండలం గూడెందొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ గొంతుకోసుకుని బలవణ్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రాజు, సత్యమ్మకు 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. సత్యమ్మకు పిల్లలు పుట్టి చనిపోతున్నారని భర్త తరచుగా వేధిస్తూ ఉండేవాడు. ఆమె చనిపోతే మరో పెళ్లి చేసుకుంటానని... మానసికంగా హింసించేవాడు. భర్త మాటలతో మనస్తాపం చెందిన సత్యమ్మ ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తిపీటతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిరాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

భర్త వేధింపులు తాళలేక కత్తిపీటతో గొంతుకోసుకుని భార్య మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details