జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఊరు వాడ అందమైన రంగవల్లులతో, గొబ్బెమ్మలతో కళకళలాడుతున్నాయి. వీధులన్ని ముత్యాల ముగ్గులతో నిండిపోయాయి. ఆడపడుచులందరూ తెల్లవారుజామునే రంగుల ముగ్గుల్లో నవధాన్యలు వేసి పూజలు జరిపారు.
రంగవల్లులతో కళకళలాడుతున్న ఊరు వాడ..! - గొబ్బెమ్మలు
అలంపూర్ పట్టణంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలందరూ వేకువజామునే ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు.
![రంగవల్లులతో కళకళలాడుతున్న ఊరు వాడ..! The villages of Alampur in Jogulamba Gadwal district are adorned with Sankranthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10224837-349-10224837-1610520928438.jpg)
ఊరు వాడ రంగవల్లులతో కళకళలాడుతున్నాయి