తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్డీఎస్ కాలువకు గండి.. పంట పొలాల్లోకి నీరు.. - జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు

కెనాల్​ కాలువలకు మరమ్మతులు చేయక గండి పడుతున్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం సిందనూర్ సమీపంలో ఆర్డీఎస్ ప్రధాన కాలువకు 12వ డిస్ట్రిబ్యూటర్ వద్ద తెల్లవారుజామున గండి పండింది. నీరంతా పంట పొలాలకు వెళ్లటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

The RTS hole was drilled in jogulamba gadwala district
ఆర్డీఎస్ కాలువకు గండి.. పంట పొలాల్లోకి నీరు..

By

Published : Dec 12, 2020, 1:30 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం సిందనూర్ సమీపంలో ఆర్డీఎస్ ప్రధాన కాలువకు 12వ డిస్ట్రిబ్యూటర్ వద్ద తెల్లవారుజామున గండి పండింది. కాలువలోని నీరు గండి ద్వారా పంట పొలాల్లోకి వెళ్తోంది. పొలాలు నీటిలో మునగటంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్డీఎస్ ప్రధాన కాలువ సిందనూర్ నుంచి మొదలు కావడంతో ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కుగా ఉంటుంది. ఈ ప్రధాన కాలువకు గండి పడటంతో నీరు వేగంగా పక్క ఉన్న పొలాలలోకి వెళ్తోంది. అధికారులు వెంటనే స్పందించి కాలువకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఆర్డీఎస్ కాలువకు గండి.. పంట పొలాల్లోకి నీరు..

ఇదీ చదవండి:వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కడతేర్చాడు!

ABOUT THE AUTHOR

...view details