జోగులాంబ గద్వాలకు చెందిన ఇల్లూరి శ్రీలక్ష్మి ఎనిమిదేళ్లుగా బియ్యం గింజలపై రామనామాలు రాస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా 20,116 బియ్యపు గింజలపై శ్రీరామనామం రాసి భక్తిని చాటుకున్నారు. సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా స్థానిక శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో జరిగే వేడుకలకు తలంబ్రాలుగా అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.
గింజ గింజపై రామనామం.. ఎక్కడో తెలుసా?! - తెలంగాణ తాజా వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇల్లూరి శ్రీలక్ష్మి బియ్యం గింజలపై శ్రీరామనామం రాయడంలో నైపుణ్యం సాధించారు. సూక్ష్మ చిత్రకళలో శిక్షణ లేకున్నా... ఎనిమిదేళ్లుగా బియ్యం గింజలపై రామనామాలు రాస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.
గింజలపై శ్రీరామ నామం
2015 నుంచి శ్రీరామ నామాలు రాయడం ప్రారంభించానని తెలిపారు. ప్రతి సంవత్సరం బియ్యపు గింజలపై శ్రీరామనామాలు రాస్తూ తలంబ్రాలుగా అందిస్తున్నారు. గతంలో ఒకసారి50వేలు, మరో ఏడాది 1.50 లక్షల బియ్యపు గింజలపై రామనామాలు రాసి భద్రాచలంలోని సీతారాముల కల్యాణోత్సవానికి పంపిచానని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రుక్మిణమ్మ నిర్ణయం.. అనాథల పాలిట వరం