జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. గత నాలుగు రోజుల నుంచి జూరాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరడం వల్ల జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది.
ఎగువ నుంచి వరదనీరు రాక.. జూరాలకు జలకళ - latest news of jurala progect
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాలకు నిలకడగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. వరద నీరు చేరుతుండడం వల్ల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటుంది.
ఎగువ నుంచి వరదనీరు రాక.. జూరాలకు జలకళ
ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు జూరాల జలాశయంలోకి 5,743 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. జూరాల పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతము 316.620 మీటర్లు ఉంది. జూరాల పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 6.126 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చదవండి:గుడ్న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కొవాక్జిన్!