తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ సంకల్పంతోనే తెలంగాణ సాధ్యమైంది' - telangana formation day in gadwal district

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో ఏనే సంకల్పంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించడం వల్లే తెలంగాణ రాష్ట్రమనే చిరకాల స్వప్నం సాకారమైందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.

telangana state whip guvvala balaraju hoisted national flag
గద్వాలలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

By

Published : Jun 2, 2020, 4:26 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్​లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు.

ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్లలోనే పూర్తి చేశారని గువ్వల బాలరాజు అన్నారు. కేసీఆర్ సారథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కష్టపడి పనిచేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం నేడు దేశం గర్వించే స్థాయికి చేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్మృతి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం, జడ్పీ ఛైర్​పర్సన్ సరిత పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details