Supreme Court on Gadwal MLA Disqualification :గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ప్రకటించడంపై బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఎన్నికల సంఘం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
EC Orders to DK Aruna Elected From Gadwal Constituency : గద్వాల నుంచి డీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని ఈసీ ఆదేశం
డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే అరుణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు వెల్లడించకపోవడం తప్పేనని కృష్ణమోహన్ రెడ్డి న్యాయవాది అంగీకరించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు... తదుపరి విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది.
DK Aruna MLA Gazette : గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్!
గత నెలలో హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే.. : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(Gadwala MLA Krishnamohan Reddy) ఎన్నికను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు(Telangana High Court) గత నెల 24న తీర్పు వెలువరించింది. రెండోస్థానంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అంశంలో ఈ తీర్పును వెలువరించింది. ప్రజా ప్రాతినిథ్యచట్టం ఉల్లంఘించినందున ఎమ్మెల్యే రూ.2.50 లక్షల జరిమానా చెల్లించడంతో పాటు.. పిటిషనర్ అయిన డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
సుప్రీంను ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..: అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వాదనను వినకుండా హైకోర్టు తీర్పును వెలువరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీకే అరుణ(DK Aruna) ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. కోర్టును ఆమె తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. సుప్రీంలో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్ముతున్నానన్నారు. ఆయన అనుకున్నట్లుగానే సుప్రీంలో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
DK Aruna Submits Judgement Copy : నన్ను MLAగా గుర్తించండి : డీకే అరుణ
అసలు విషయం ఇదీ..: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున డీకే అరుణ పోటీ చేశారు. కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందగా.. డీకే అరుణ రెండోస్థానంలో నిలిచారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో కృష్ణమోహన్ తన ఆస్తులు, చలాన్లు, అప్పుల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టారని డీకే అరుణ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వివాదంపై పలు విచారణల అనంతరం తాజాగా హైకోర్టు ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.
Telangana High Court Shock TO Gadwala MLA : "డీకే అరుణ టూరిస్టు నాయకురాలు.. నేను ప్రజల మనిషిని"