Viral News: జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో మూడు రోజులుగా కంటిలో నుంచి బియ్యం, రాళ్లు వస్తుండటంతో ఓ బాలిక విలవిల్లాడుతుంది. మానవపాడు మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ, రంగన్నల కూతురు దీపాలి. స్థానిక కేజీబీవీలో 6వ తరగతి చదువుతోంది. మూడు రోజుల నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కుడి కంటిలో నుంచి రాళ్లు, బియ్యం వస్తున్నాయి. ఈ విషయాన్ని చిన్నారి ప్రధానోపాధ్యాయునికి తెలిపింది.
ప్రధానోపాధ్యాయుడు బాలిక కుటుంబీకులకు సమాచారం అందించగా.. వారు దీపాలిని స్థానిక వైద్యుడికి చూపించారు. అనంతరం ఏపీ కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి కంటి పరీక్షలు చేయించారు. వైద్యులు ఏమీ లేదని కొట్టిపారేశారు. ఇంటికి తీసుకొచ్చాక మళ్లీ చిన్నారి కంటిలో నుంచి రాళ్లు, బియ్యం వస్తుండటంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజూ 15 నుంచి 20 వరకు రాళ్లు, బియ్యం వస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఫోన్లో డాక్టర్లను వివరణ కోరగా.. కంటిలో నుంచి బియ్యం రావడం అనేది నమ్మలేనిదని డాక్టర్లు అంటున్నారు.
"నా పేరు దీపాలి. నేను ఆరో తరగతి చదువుతున్నాను. గత మూడు రోజుల నుంచి నా కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు." - దీపాలి, బాధిత చిన్నారి