తెలంగాణ

telangana

ETV Bharat / state

'మొక్కల సంరక్షణకు సిబ్బందిని నియమించండి' - latest news of jogulambha gadwala

మొక్కలను నాటిన తక్షణం వాటిని సంరక్షించే విధంగా సిబ్బందిని నియమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందనరావు అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులపై ఆరా తీశారు.

state Panchayath Raj commissioner raghunandhan visit jogulambhagadwala district
'హరితహారం మొక్కలను సంరక్షణకు సిబ్బందిని నియమించండి'

By

Published : Jul 18, 2020, 8:46 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్​ రఘునందన్​ పర్యటించారు. గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, హరితహారం మొక్కలు, ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు. యాక్తాపురం గ్రామం వద్ద ఉన్న రహదారిలో ఆయన మొక్కలు నాటారు. హరితహారంలో మొక్కలు నాటిన తక్షణం వాటిని సంరక్షించే విధంగా సిబ్బందిని నియమించి మొక్కలను సంరక్షించే బాధ్యత వహించాలన్నారు.

కొండేరు గ్రామంలో సెగ్రిగేషన్ యార్డును పరిశీలించిన ఆయన చెత్త సేకరణ అనంతరం తడి, పొడి చెత్తను ఎలా వేరు చేస్తున్నారని గ్రామపంచాయతీ సర్పంచ్​, సిబ్బందిని ప్రశ్నించారు. సరైన సమాదానంరాక పోవడం వల్ల ప్రతి గ్రామపంచాయతీ సిబ్బందికి చెత్త వేరుచేసే విధానంపై తగు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్​కు ఆదేశించారు.

గ్రామంలో ప్రజల అవసరం మేరకు ఏఏ మొక్కలు కావాలో వచ్చే సంవత్సరానికి గ్రీన్ ప్లాన్ తయారు చేసుకుని నర్సరీలలో అట్టి మొక్కలు పెంచే విధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ శ్రుతి ఓజా, జిల్లా పరిషత్ ఛైర్మన్ సరిత, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.


ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ABOUT THE AUTHOR

...view details