గద్వాల జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని పారదర్శకత, నిబద్ధతతో పనిచేసే విధంగా చూస్తానని, జిల్లాలోని మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిల్లా నూతన పరిపాలన అధికారి శ్రుతి ఓజా అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా పాలనాధికారిగా సోమవారం శృతి ఓజా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు అధికారులు పూల బొకేలతో స్వాగతం పలికారు.