జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఉండవెల్లి మండలం తక్కశిల గ్రామంలో భవన నిర్మాణ కార్మికులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సొసైటీ పదిహేను రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. నిర్మాణ రంగంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎలా నిర్మాణాలను చేయాలి అనే అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే మేస్త్రీలకు హెల్మెట్, టీషర్టుతో పాటు మధ్యాహ్న భోజనం, రోజుకు 300 రూపాయల స్టైఫండ్ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 60 మంది శిక్షణ పొందుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు.
భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక శిక్షణ - శిక్షణ
హెల్మెట్, టీషర్టు, రోజుకు మూడు వందల రూపాయల స్టైఫండ్, మధ్యాహ్న భోజనంతో భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా శిక్షణనందిస్తోంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సొసైటీ.
భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక శిక్షణ