అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సూర్య గ్రహణం సందర్భంగా నిన్న రాత్రి 8 గంటలకు మూసివేశారు. ఈ మధ్యాహ్నం సూర్యగ్రహణం తొలగిపోవడంతో ఆలయ అర్చకులు సిబ్బంది ఆలయాలను నది నీటితో శుద్ధి చేశారు. మహా సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ అర్చకులు ఆలయాలను తెరిచారు. మహామంగళహారతితో అర్చకులు పూజలు నిర్వహించారు.
ఆలయాలను శుద్ధిచేసిన అర్చకులు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐదవ శక్తిపీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సూర్యగ్రహణం సందర్భంగా నిన్న రాత్రి మూసివేశారు. ఈ రోజు మధ్యాహ్నం గ్రహణం తొలగిపోవడంతో ఆలయాలను తెరిచి సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయాలను శుద్ధిచేసిన అర్చకులు