జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో డ్రోన్ ద్వారా సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పురపాలిక పరిధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పట్టణంలోని అన్ని వార్డుల్లో డ్రోన్ సహాయంతో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష, డీఎంహెచ్వో శశికళ, పురపాలిక ఛైర్పర్సన్ కరుణలు దగ్గరుండి డ్రోన్ పనితీరును పర్యవేక్షించారు.
డ్రోన్ సాయంతో సోడియం హైపో క్లోరైట్ పిచికారీ - Jogulamba gadwal Vaddepalli Municipality Drone Spray
కరోనా వ్యాప్తి నివారణ కోసం జోగులాంబ గద్వాల జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. జిల్లాలోని వడ్డేపల్లి మునిసిపాలిటీలో డ్రోన్ సాయంతో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
డ్రోన్ పిచికారీ
TAGGED:
Drone Chemical Spray