జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామ శివారులోని పుష్కర ఘాట్ చూసేందుకు బైక్‌పై రమేశ్ వెళ్లాడు. ద్విచక్ర వాహనాన్ని నది పక్కన పార్క్ చేశాడు. ఇంతలో నీటిలో నుంచి వచ్చిన పాము బైక్ సీటులోకి దూరింది.
బైక్ సీటులో నాగుపాము.. వాహనదారుడి పరేషాన్
సరదాగా పుష్కరఘాట్ చూసేందుకు బైక్‌పై వచ్చాడు. కృష్ణానదిలో స్నేహితులతో కలిసి ఆనందంలో మునిగిపోయాడు. ఇంతలో ఓ నాగుపాము బైక్‌లోకి దూరింది. పడగవిప్పి బుసలు కొడుతూ కొద్దిసేపు పరేషాన్ చేసింది.
బైక్ సీటులో నాగుపాము
పామును గమనించిన స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ పాము బుసలు కొడుతూ భయపెట్టింది. ఎలాగో అలా కష్టపడి దాన్ని బయటకు పంపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: షోపియాన్ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్