తెలంగాణ

telangana

ETV Bharat / state

అలంపూర్​ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం - గద్వాల జిల్లా తాజా వార్తలు

గద్వాల్ జిల్లా అలంపూర్​ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్​​ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీలోని కర్నూలుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

అలంపూర్​ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
అలంపూర్​ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

By

Published : Jul 29, 2020, 10:04 PM IST

గద్వాల జిల్లా అలంపూర్​ వద్ద భారీ మొత్తంలో అక్రమ మద్యాన్ని ఎక్సైజ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచలింగల చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టగా మద్యం పట్టుబడింది.

మద్యాన్ని తరలిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 481 మద్యం సీసాలు, మూడు ఆటోలు, ఎనిమిది ద్విచక్ర వాహనాలు సీజ్​ చేసినట్లు ఎక్సైజ్​ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీలోని కర్నూలుకు అక్రమంగా తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ABOUT THE AUTHOR

...view details