తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2020, 4:28 PM IST

ETV Bharat / state

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని కాంగ్రెస్​ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే సంపత్​కుమార్ రైతుల వద్దకు వెళ్లి సంతకాలను సేకరించారు.

signature gathering against agricultural bill by congress in alampur
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సంపత్​కుమార్​ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా అలంపూర్​లో సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్​ కార్యకర్తలు, నాయకులతో కలిసి స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరించారు. కార్పొరేట్​ శక్తులకు అనుకూలంగా ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణలో 12 లక్షల సంతకాలను సేకరించి రాష్ట్రపతికి అందజేయనున్నట్లు సంపత్​కుమార్​ తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా సీఎం కేసీఆర్​ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని సంపత్​కుమార్​ ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నవంబర్​ నెలాఖరులో రానున్న తుంగభద్ర పుష్కరాల కోసం గద్​వాల జిల్లాలో కనీస ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలతో ఆడుకోకుండా పుష్కరాలకు ఏర్పాటు చేయాలని సంపత్​ డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండిఃతుంగభద్ర పుష్కరాలకు చకచకా ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details