తెలంగాణ

telangana

ETV Bharat / state

చూడామణి సూర్యగ్రహణం... దక్కని అమ్మవారి దర్శనం...!

అష్టాదశ శక్తి పీఠాలలోని ఐదో శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మశ్వర స్వామి ఆలయాన్ని చూడామణి సూర్యగ్రహణం కారణంగా అర్చకులు మూసివేశారు. ఉదయమే అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి, ఆలయ ద్వారాలకు తాళాలు వేశారు. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు శుద్ధి సంప్రోక్షణ గావించిన తరువాత 7 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం మహా మంగళహారతితో తెరువనున్నారు.

By

Published : Jun 21, 2020, 1:06 PM IST

Breaking News

దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తి పీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మశ్వర స్వామి ఆలయంలోని శక్తి పీఠం. చూడామణి సూర్యగ్రహణం కారణంగా... అర్చకులు ఉదయమే అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి, ఆలయాన్ని మూసివేశారు. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు శుద్ధి సంప్రోక్షణ గావించిన తరువాత 7 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం మహా మంగళహారతితో తెరువనున్నారు. సూర్యగ్రహణం కారణంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని మిగతా దేవాలయాలు కూడా మూసివేశారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం సూచించిన వేళల్లో దర్శనాలు సాధ్యం కాకపోవడం వల్ల... అమ్మవారు భక్తులకు తిరిగి రేపు ఉదయం మహా మంగళహారతితో దర్శనమివ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details