తెలంగాణ

telangana

ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాల్లో ఎస్​జీవో వాలంటీర్ల సేవలు

సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్​ నిర్వాహకులు. మేమున్నాం అంటూ ముందుకు వచ్చి తుంగభద్ర పుష్కరాల్లో వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న పుష్కరాల్లో క్యూలైన్ల వద్ద భక్తులకు సూచనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

SGO volunteers service in thungabhadra pushkaralu in jogulamaba gadwal dist
తుంగభద్ర పుష్కరాల్లో ఎస్​జీవో వాలంటీర్ల సేవలు

By

Published : Nov 22, 2020, 5:34 PM IST

దిల్లీ కేంద్రంగా పనిచేసే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ (ఎస్​జీవో) సామాజిక సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాల్లో ఘాట్ల వద్ద భక్తులకు సేవలు అందిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతోంది. తెలంగాణలో దాదాపు 300 మంది వాలంటీర్లు వివిధ సేవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

పుష్కరఘాట్ల వద్ద క్యూలైన్లలో భక్తులకు సూచనలు ఇస్తూ అదుపు చేస్తున్నారు. అటు పోలీస్​శాఖకు, ఆలయ సిబ్బందికి సహకారం అందిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో సేవాగుణం, ధైర్యసాహసాలు అలవడేలా ఉత్తమ పౌరులను అందించడమే తమ కర్తవ్యమని ఎస్​జీవో అసిస్టెంట్ కమిషనర్ రాజ్​కుమార్ వెల్లడించారు. అమ్మవారి సన్నిధిలో పుష్కరసేవలో పాల్గొనడం ఆనందంగా ఉందని వాలంటీర్లు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రశ్నించే గొంతునే గెలిపించండి: భాజపా అభ్యర్థి

ABOUT THE AUTHOR

...view details