జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. పుష్కరాల్లో ఏడో రోజు భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించి... తుంగభద్ర నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
తుంగభద్ర పుష్కరాలు... ఏడో రోజు పోటెత్తిన భక్తులు - పుష్కరాల్లో భక్తుల సందడి
తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ఏడో రోజు భక్తుల సందడి నెలకొంది. వేకువ జామునే భక్తులు తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం కార్తీక దీపాలు వదలి నదీమ తల్లికి మొక్కులు సమర్పించుకుంటున్నారు.
తుంగభద్ర పుష్కరాలు... ఏడో రోజు పోటెత్తిన భక్తులు
కరోనా కారణంగా థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే భక్తులను అనుమతిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఘాట్లను శుభ్రం చేస్తున్నారు. పుష్కరాలకు అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:శోభాయమానంగా తుంగభద్ర నదీమ పుష్కర హారతి