తెలంగాణ

telangana

ETV Bharat / state

Seed cotton Farmers Problems : గద్వాల జిల్లాలో విత్తనపత్తి పంటకు నష్టాలు - తెలంగాణ న్యూస్

Seed Cotton Farmers Problems in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి రైతులు సుంకు సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల విత్తనాలు మొలకెత్తక పోవడంతో వేసిన పంటను తీసేసి మరో పంటను వేసిన విత్తనపత్తి రైతులు ఇప్పుడు.. మగ పుష్పానికి పుప్పొడి రాక ఇబ్బందులు పడుతున్నారు. సుంకు రాకపోతే ఫలదీకరణం జరగదని, పెట్టిన పెట్టుబడి, శ్రమ, క్రాసింగ్ కోసం కూలీలకు ఇచ్చిన అడ్వాన్సులు నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి రైతులు ఎదుర్కొంటున్న సుంకు సమస్యపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Seed Cotton Farmers Problems
Seed Cotton Farmers Problems

By

Published : Jul 2, 2023, 10:13 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి పంటకు నష్టాలు

Seed cotton Farmers Problems Gadwal : జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా 45 వేల ఎకరాలకు పైగా విత్తనపత్తి సాగవుతోంది. దీని కోసం విత్తన కంపెనీలు ఆడ-మగ విత్తనాల్ని వేర్వేరుగా పంపిణీ చేస్తాయి. ప్రతీ సంవత్సరం జూన్, జూలై నెలల్లో ఈ పంట పూతకొస్తుంది. అయితే మగ పుష్పాలకు పుప్పొడి వచ్చిన తర్వాత దాన్ని ఆడ పుష్పాల మీద రాయడం ద్వారా ఫలదీకరణం చేస్తారు. ఈ పుప్పొడినిరైతులు సుంకు అంటారు. ఈ సుంకు వస్తేనే ఆ ఫలదీకరణ ప్రక్రియ నిర్వహించడం సాధ్యం అవుతుంది. ఫలదీకరణం జరిగితేనే విత్తనాలు ఏర్పడతాయి.

Gadwal Seed Cotton Farmers :గద్వాల జిల్లా బిజ్వారంలో శ్రీరామ కంపెనీ అందించినవిత్తనాలతో రైతులు సాగు చేస్తున్నారు. కానీ.. పుష్పాలకు పుప్పొడి రాకపోవడంతో విత్తన రైతులు సందిగ్ధంలో పడ్డారు. ఇక్కడ 80 మంది రైతుల పొలాల్లో శ్రీరామ కంపెనీ విత్తనాలకు సుంకు రాలేదు. దీంతో క్రాసింగ్ ప్రక్రియ జరగడం లేదు. విత్తన కంపెనీల ప్రతినిధులకు సమాచారం ఇస్తే.. అధిక ఉష్ణోగ్రతల వల్ల వాతావరణం అనుకూలించక పోవడం వల్లే సుంకు రాలేదని చెబుతున్నారని రైతులంటున్నారు. అయితే.. శ్రీరామ కంపెనీ తప్ప మిగతా కంపెనీల విత్తనాలకు పుప్పొడి వస్తోందని, విత్తనాల తేడాల వల్లే ఈ సమస్య తలెత్తి ఉంటుందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Seed Cotton Problems in Jogulamba Gadwala : ఒక్కో రైతు పెట్టుబడులు, కూలీల కోసం ఎకరాకు 2 లక్షల వరకు ఖర్చు చేశారు. ఈ సమయంలో పుష్పాలకు పుప్పొడి రాకపోతే పెట్టుబడి అంతా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ కంపెనీ చొరవ తీసుకుని ఈ సమస్యకు పరిష్కారం వెతకాలనీ, పంట నష్టపోయిన వారికి పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఆందోళన బాట పడతామంటున్నారు. ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందన్న వ్యవసాయ శాఖ.. కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పంటలకు జరిగన నష్టాన్ని గుర్తించి, పరిహారం అందించాలని విత్తనపత్తి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీరామ కంపెనీ విత్తనాల నాణ్యతను పరిశీలించాలని కోరుతున్నారు.

"ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 25 వేల నుంచి 35 వేల ఎకరాలలో విత్తనపత్తి వేస్తారు. సీడ్ పత్తి రైతులకు కంపెనీ వారు విత్తనాలు ఏప్రిల్, మే మాసంలో ఇస్తారు. మగ పుష్పాల పుప్పొడిని ఆడ పుష్పాలపైన రుద్ధి ఫలధీకరణ చేస్తారు. తద్వారా విత్తనం తయారవుతుంది. ఈ ఫలధీకరణ చేయాలంటే మగ పుష్పాలకు పుప్పొడి(సుంకు) రావాలి. వాతావరణం అధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో సుంకు రావట్లేదని కంపెనీలు చెబుతున్నాయి." -గోవింద నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details