ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హుజూర్నగర్ రైతులపై ఉన్న ప్రేమ జోగులాంబ గద్వాల జిల్లా రైతులపై లేదన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈనెల 8న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి తలపెట్టామన్నారు. 16న ప్రజలను జాగృతం చేయడానికి పాదయాత్ర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 శాతం ఉన్న జీడీపీ.. భాజపా పాలనలో మూడు శాతానికి పడిపోయిందన్నారు.
'హుజూర్‌నగర్‌పై ఉన్న ప్రేమ జోగులాంబ జిల్లాపై లేదా?'
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈనెల 8న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి తలపెట్టామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తెలిపారు. 16న ప్రజలను జాగృతం చేయడానికి పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
కేసీఆర్‌పై మండిపడ్డ సంపత్‌కుమార్