జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి గత మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. పెండింగులో ఉన్న జీతాలు చెల్లించాలంటూ వారందరూ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. కరోనా కష్టకాలంలో ఇంటి వాళ్లకు దూరమై ఆసుపత్రిలో పనిచేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధను కల్గిస్తోందని కార్మికులు పేర్కొన్నారు.
Sanitation workers protest: ప్రభుత్వాసుపత్రి ఎదుట కాంట్రాక్టు కార్మికుల ఆందోళన - జోగులాంబ గద్వాలలో కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేశారు. కరోనా సమయంలోనూ పనిచేస్తున్న తమకు గత మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాసుపత్రి ఎదుట కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
కార్మికుల ధర్నా విషయం తెలుసుకున్న జిల్లా ఆసుపత్రి ఇన్ఛార్జీ సూపరింటెండెంట్ చందు నాయక్ అక్కడికి వచ్చి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. ఆయన హామీతో కార్మికులు ఆందోళనను విరమించారు. అనంతరం చందు నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ
TAGGED:
sanitation workers protest