జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడు గ్రామ శివారులో తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామ శివారులో డంపులుగా నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి ఇసుక రవాణా చేసుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారంతో రెవెన్యూ సిబ్బంది, మానవపాడు ఎస్సై తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 50 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఎవరైనా ఇసుకను తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 50ట్రిప్పుల ఇసుక స్వాధీనం - అక్రమంగా నిల్వ ఉంచిన 50ట్రిప్పుల ఇసుక స్వాధీనం
జోగులాంబ గద్వాల జిల్లా కొర్విపాడులో అక్రమంగా నిల్వ ఉంచిన 50ట్రిప్పుల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు.
![అక్రమంగా నిల్వ ఉంచిన 50ట్రిప్పుల ఇసుక స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5086864-998-5086864-1573914542745.jpg)
అక్రమంగా నిల్వ ఉంచిన 50ట్రిప్పుల ఇసుక స్వాధీనం