తెలంగాణ

telangana

ETV Bharat / state

'40 ఏళ్లుగా సాధ్యం కానిది తెరాసతో సాధ్యమైంది' - '40 ఏళ్లుగా సాధ్యం కానిది తెరాసతో సాధ్యమైంది'

40 ఏళ్లంగా సాధ్యంకాని పని తెరాస హయాంలో సాధ్యమైందని ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మానవపాడు మండలం నుంచి చండూరు వరకు కోటీ 35 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. చండూరుకు 40 ఏళ్లుగా రోడ్డు లేదని... తెరాస వల్లే అది సాధ్యమైందని పేర్కొన్నారు.

road construction started in chanduru
'40 ఏళ్లుగా సాధ్యం కానిది తెరాసతో సాధ్యమైంది'

By

Published : Jun 30, 2020, 4:50 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో జడ్పీ ఛైర్​పర్సన్​ సరిత, ఎమ్మెల్యే అబ్రహం... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మానవపాడు మండలం నుంచి చండూరు వరకు రూ. కోటి 35లక్షలతో నిర్మాణం చేపట్టిన బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. చండూర్ గ్రామానికి 40 ఏళ్లుగా రోడ్డు లేదని... తెరాస ప్రభుత్వం వల్లే అది సాధ్యమైందని ఎమ్మెల్యే తెలిపారు. హరితహారం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో గ్రామస్థులంతా పాల్గొని చండూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఇదీ చూడండి:భారత్‌ బయోటెక్‌కు గవర్నర్‌ తమిళిసై అభినందనలు

ABOUT THE AUTHOR

...view details