Dharur Road Accident Today :రాష్ట్రంలో రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల జరిగిన.. రెండు రోడ్డు ప్రమాదాలు.. బాధిత కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలకు అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. స్నేహితురాలి పెళ్లికి ముందు పార్టీ చేసుకుందామని కారులో సరదాగా బయల్దేరిన మిత్రులంతా ఊహించని రోడ్డు ప్రమాదం వారి జీవితాలను తలకిందులు చేసింది. ఇక ఇవాళ ఉదయం జరిగిన మరో రోడ్డు ప్రమాదం ఇంకో కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుని వారి ఫ్యామిలీలో తీరని విషాదాన్ని నింపింది.
Gadwal Road Accident Today : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధరూరు మండలంలోని రాయచూరు రహదారిపై శనివారం తెల్లవారుజామున.. గద్వాల నుంచి రాయచూరుకు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు గద్వాల పట్టణానికి చెందిన జములమ్మ, అర్జున్, వైశాలి పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు మృతదేహాలను గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Road Accident at Khanapur :మరోవైపు శుక్రవారం రోజున రంగారెడ్డి జిల్లా నార్సింగి ఠాణా పరిధిలోని ఖానాపూర్ కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన మూడు కుటుంబాల్లో అంతులేని వేదనను మిగిల్చింది. అతివేగం, నిర్లక్ష్యం నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఒకరు బ్రెయిన్ డెడ్ అయ్యారు. హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన ఎమిలిపురం సత్తిబాబు.. స్థానిక శ్రీసాయి రెసిడెన్సీ అపార్టుమెంటులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి దివ్య, అర్జున్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.