తెలంగాణ

telangana

ETV Bharat / state

కబ్జా కోరల్లో వాగులు.. ఆక్రమణలు పట్టని అధికారులు - jogulamba gadwala news

గద్వాల జిల్లా అలంపూర్‌ జోగులాంబ వాగులో కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినవారికి నోటీసులు జారీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి... అలంపూర్‌ పురపాలిక సిబ్బందికి ఆదేశించారు. నెలరోజుల కిందట ఆయన సిబ్బందిని ఆదేశించినా నేటికీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ఈ విషయమై మేనేజర్‌ జయప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లగా వాగులో నిర్మాణాలు చేపట్టినవారికి మౌఖికంగా చెప్పామన్నారు. త్వరలో ఛైర్‌పర్సన్‌తో చర్చించి నోటీసులు జారీ చేస్తామన్నారు.

Alampur municipality
Alampur municipality

By

Published : Jul 12, 2020, 1:21 PM IST

ఖాళీ జాగా కనిపిస్తే ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారు.. వాగులను సైతం వదలడం లేదు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ పురపాలికలో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి.

  • అలంపూర్‌లో జోగులాంబవాగు ఆక్రమించి దుకాణాలు, ఇళ్ల నిర్మించుకున్నారు. వర్షం కురిస్తే నీరెళ్లే పరిస్థితి లేదు. గాంధీచౌక్‌ నుంచి ప్రధాన మార్గంమధ్యలో జోగులాంబ వాగు ఉంది. దీనికి ఇరువైపులా ఖాళీ స్థలం ఉండేది. ప్రస్తుతం ఆ ఖాళీ స్థలం కనిపించడం లేదు. కొందరు నాయకులు తమ వర్గీయులకు నిర్మాణాలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 2009లో వరదతో అలంపూర్‌ ముంపునకు గురైంది. ఆ సమయంలో వాగులో నీరు బయటకు వెళ్లకపోవడంతో నెల రోజులు పట్టణం నీటిలోనే ఉంది. చివరికి నదికి గండిపెట్టి నీటిని పంపించారు.
  • అలంపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు మోటార్ల వరకు జోగులాంబ వాగు 500 మీటర్లు ఉంది. వాగును కబ్జా చేసి ఇళ్లు నిర్మించారు. ప్రధానరోడ్డు వద్ద దుకాణాలు నిర్మించారు. వర్షం నీరొస్తే ప్రమాదం పొంచి ఉంది. వాగులోనే పెద్దగా సిమెంట్‌స్లాబ్‌ వేసి దానిపై దుకాణాలు, ఇళ్లనిర్మించారు. స్లాబ్‌ కింది భాగంలో వర్షపు నీరు, మురుగు నీరు వెళ్లేందుకు కొంత మేరకు రంధ్రాలు చేశారు. కోర్టుకు సమీపంలోని వాగులోనూ నిర్మాణాలు చేసేందుకు వారం రోజుల కిందట రాళ్లు తరలించారు. ఆస్పత్రికి సమీపంలోని వాగులో ఇప్పటికే కొంతమేరకు ఇంటి నిర్మాణం చేసినా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.
  • అయిజ పురపాలికలో ప్రభుత్వ భూముల కబ్జాపై ప్రస్తుతం కోర్టులో కేసు కొనసాగుతోంది. గద్వాల పురపాలికలో చాలా ప్రభుత్వ స్థలాలు కజ్జాకు గురయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details