శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదానికి కారణాలపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి 9.30 - 10.30 గంటల మధ్య షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ప్యానెల్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తూ.. పొగలు కమ్ముకోవడం వల్ల అక్కడినుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం బయటికి వచ్చారు. మిగిలిన తొమ్మిది మంది అక్కడే ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి మృత్యువాతపడ్డారు. అయితే వీరిని గాలించి బయటకు తీయడం కోసం సీఐఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జెన్కో,పోలీస్, వైద్య సిబ్బంది, ఫైరింజన్లు, 108 వాహనాలతో సొరంగ మార్గంలోకి వెళ్లి ముమ్మరంగా గాలించారు.
శ్రీశైలంలో ప్రత్యేక బలగాలు ఎంతగా శ్రమించాయో తెలుసా! - శ్రీశైలం
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారిని వెతికేందుకు ప్రత్యేక బృందాలు సొరంగమార్గంలో తీవ్రంగా శ్రమించాయి. సొరంగమార్గంలో దట్టమైన పొగల మధ్య వారు చేసిన సహాయక చర్యలు ఏ విధంగా చేశారో వీడియోలు బయటకు వచ్చాయి. వారు చేసిన కఠోర శ్రమను చూసి ప్రజలందరూ హర్షిస్తున్నారు.
సొరంగ మార్గంలో దట్టమైన పొగ, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల కారు చీకట్లో లైట్లు వేసుకుని ఎంతో తీవ్రంగా శ్రమించారు. ఇలా ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒకసారి ఫైర్ఇంజన్లు, 108 వాహనాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వీరిని వెతకడం కోసం ప్రత్యేక బలగాలు ఆక్సిజన్ సిలిండర్లు, బ్యాటరీ లైట్లతో ముమ్మరంగా గాలించారు. తీవ్రంగా శ్రమించారు. దీంతో మృతి చెందిన వారి ఆచూకీ లభించింది. ఈ సొరంగ మార్గంలో చిమ్మచీకటిలో దట్టమైన పొగల మధ్య లైట్లు వేసుకుంటూ వారు చేసిన శ్రమకు ఫలితం దొరికింది. వారు చేసిన సహాయక చర్యలు ఏ విధంగా చేశారో వీడియోలు బయటకు వచ్చాయి. వారు చేసిన కఠోర శ్రమను చూసి ప్రజలందరూ హర్షిస్తున్నారు.
ఇవీ చూడండి: గవర్నర్కు రేవంత్ లేఖ.. 'శ్రీశైలం విషయంలో జోక్యం చేసుకోండి'