చేనేతకు ఏదీ చేయూత పేరుతో ఈటీవీలో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. జోగులాంబ గద్వాల జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ చరణ్... ఇవాళ రాజోలీలో చేనేత కార్మికులకు వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. చేనేత మిత్ర పథకంలో లబ్ధిపొందుతున్న కార్మికుల నుంచి మాస్టర్ వ్యూవర్లు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపైనా అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఎవరైనా డబ్బులు అడిగినా... ఇబ్బందులకు గురి చేసినా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రుణమాఫీ, ముద్ర రుణాలు సహా ఇతర పథకాలపై కార్మికుల సందేహలను ఆయన నివృత్తి చేశారు. పథకాల అమల్లో ఎలాంటి అవకతవకలు, జాప్యం జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
'చేనేత ఏదీ చేయూత' కథనానికి స్పందన - చేనేచకు అండగా ఈటీవీ
రాజోలిలో చేనేత కార్మికులకు వివిధ పథకాలపై అవగాహన కల్పించారు జోగులాంబ గద్వాల జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ చరణ్.
చేనేత కథనానికి స్పందన