జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులో ఆర్డీఎస్ కాల్వకు గండిపడింది. 34వ డిస్ట్రిబ్యూటర్ వద్ద కాల్వ కోతకు గురై.. 6 కిలోమీటర్ల మేర పొలాల్లోకి నీరు పారుతోంది. సేద్యం చేసిన పొలాల్లోకి నిన్నటి నుంచి నీరు పారుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
RDS CANAL: ఆర్డీఎస్ కాల్వకు గండి.. పొలాల్లోకి పారుతోన్న నీరు
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు శివారులో ఆర్డీఎస్ కాల్వకు గండిపడింది. నిన్నటి నుంచి నీరంతా పొలాల్లోకి పారుతోంది. పంటలు వేయకముందే ఇలా ఉంటే.. వేశాక పరిస్థితేంటని రైతులు వాపోతున్నారు.
RDS CANAL: ఆర్డీఎస్ కాల్వకు గండి.. పొలాల్లోకి పారుతోన్న నీరు
ఇటీవల కురిసిన వర్షాలకు జూరాల జలాశయానికి ప్రవాహం రావడంతో కాల్వలకు నీళ్లు వదిలారు. ఆర్డీఎస్ కాల్వకు అధిక మొత్తంలో నీరు వస్తుండగా.. మరమ్మతులు చేయక ఏళ్లు గడుస్తున్నాయి. ఏటా ఎక్కడో ఒక చోట గండ్లు పడుతున్నాయి. పంటలు వేయకముందే ఇలా ఉంటే.. వేశాక పరిస్థితేంటని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి: CORONA FREE VILLAGE: ఆంక్షలు పెట్టుకుని.. వైరస్ను అడ్డుకుని..!