జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాందేవ్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 27 నుంచి రూ.5100 మద్దతు ధరతో శనగలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అలంపూర్ ప్రాంతంలో అధిక సంఖ్యలో రైతులు పప్పు శనగ సాగు చేశారని చెప్పిన ఆయన.. వారిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే, మంత్రులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం - జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ మార్కెట్
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని మార్కెట్ ఛైర్మన్ రాందేవ్ రెడ్డి ప్రారంభించారు

పప్పు, శనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు
జిల్లాలో ఇరవై మూడు వేల ఎకరాలలో సాగు చేస్తున్న పప్పు శనగ కొనుగోలుకు అలంపూర్, ఐజలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎకరాకు 6క్వింటళ్ల చొప్పున రోజుకు ఒక రైతు నుంచి 25క్వింటల్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ నాణ్యమైన పంటను తీసుకొని వచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:'ఆక్రమణకు గురైన వక్ఫ్‌బోర్డు ఆస్తులు ఎన్ని స్వాధీనం చేసుకున్నారు..?'