జోగులాంబ జిల్లా గద్వాలలో టీఎన్జీవో భవన్లో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కిసాన్ పంచాయతీ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలు కొందరికి మాత్రమే లాభదాయకంగా ఉన్నాయని నారాయణమూర్తి అన్నారు.
'వారికే లాభాలు తప్ప రైతులకు కాదు' - new farm acts issue
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలు కార్పొరేట్ సంస్థలకు లాభాలు తప్ప రైతులకు కాదని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాలలో ఏర్పాటు చేసిన కిసాన్ పంచాయతీ సభలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థలను కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
'వారికి లాభాలు తప్ప రైతులకు కాదు'
మరికొద్ది రోజుల్లో దేశంలో రైతు అనే వాడు కనపడకుండా ఉండేలా.. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. దేశంలో రైతులకు మేలు జరగాలంటే స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని నారాయణమూర్తి కోరారు.
ఇదీ చూడండి :'రాష్ట్రం కోసం జానారెడ్డి సీఎం పదవిని త్యాగం చేశారు'