జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామపంచాయతీ పచ్చదనం పరిశుభ్రతతో ఆహ్లాదకర వాతావరణాన్ని సొంతం చేసుకుంది. గ్రామంలోకి వెళ్తే... రోడ్డుకిరువైపులా ఉన్న పచ్చని చెట్లు హరిత స్వాగతం పలుకుతాయి. హరితహారంలో భాగంగా గతేడాది 5.5 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా 30,000 మొక్కలు నాటించారు సర్పంచ్ నారాయణమ్మ.
సంరక్షణ బాధ్యతలు
నాటడమే కాకుండా వాటి సంరక్షణ కోసం ట్రీ గాడ్స్ ఏర్పాటు చేశారు. 400 మొక్కలకు ఒక వాటర్ మెన్ ఏర్పాటుచేసి ట్రాక్టర్‌తో ప్రతిరోజు నీళ్లు పోయిస్తున్నారు. మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. రూ.20,000ఖర్చు చేసి చెట్ల కింద బల్లలను ఏర్పాటు చేశారు.