దేశంలో తెల్లదొరల మనుగడ పోయి.. రాష్ట్రంలో నేడు నల్లదొరలు రాజ్యమేలుతున్నారని పీఆర్టీయూటీఎస్ జోగులంబ గద్వాల జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో.. ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ చేపట్టారు.
'రాష్ట్రంలో నల్లదొరలు రాజ్యమేలుతున్నారు' - ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

'రాష్ట్రంలో నల్లదొరలు రాజ్యమేలుతున్నారు'
తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఉపాధ్యాయుల సమస్యలు తీరుతాయనుకొన్న వారి ఆశలు, అడియాశలే అయ్యాయని పరమేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే భారీ ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'కరోనా గుట్టు'పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన