ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువకు గండి - priyadarshini-zoora-project-get-to-the-right-canal
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువ వద్ద భారీగా గండి పడటంతో నీరు వృథాగా పోయింది. దగ్గర్లోని విద్యుత్ స్థంభం ఒరిగి ప్రమాదకరంగా మారింది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువకు గండి
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం గుంటిపల్లి గ్రామ శివారులో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు వృథా పోయింది. దగ్గర్లోని పొలాలన్నీ నీటమునిగాయి. నిన్న రాత్రి జూరాల కుడికాలువకు నీటి ఉద్ధృతి పెరగడంతో గండి పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. కాలువ సామర్థ్యం తక్కువగా ఉండడంతో కాలువ పైనుంచి కూడా నీరు వెళ్లి పొలాలు జలమయ్యాయి.