తెలంగాణ

telangana

ETV Bharat / state

మా జీతాలు మాకు ఇప్పించండి :ప్రైవేట్ ఉపాధ్యాయులు - Gadwala private teachers protest for salaries

ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి జీతాలు ఇప్పించాలని కోరుతూ.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డీఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. కరోనా వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

private teachers protest for salaries in Jogulamba Gadwala district
గద్వాల జిల్లాలో ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆందోళన

By

Published : Sep 5, 2020, 4:26 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కరోనా వల్ల కొన్ని నెలల నుంచి తమకు రావాల్సిన జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యంతో మాట్లాడి తమకు జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. జిల్లాలోని 12 మండలాల్లో 600 మంది అధ్యాపకులు వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారని, వారందరు ఇప్పుడు జీతాల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details