గద్వాలలో రేషన్ బియ్యం పట్టివేత - Police raid illegal ration in Gadwala district
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని గద్వాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు 32.40 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు.
గద్వాలలో రేషన్ బియ్యం పట్టివేత
గద్వాల జోగులాంబ జిల్లా పాగుంట నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 32.40 క్వింటాళ్ల చౌకధర బియ్యాన్ని ఇర్కిచేడు చెక్‌పోస్టు పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని ఠాణాకు తరలించి నరేశ్, రంగారెడ్డి, నగేశ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కేటీదొడ్డి ఠాణా ఎస్సై బాలవెంకటరమణ పేర్కొన్నారు. అక్రమంగా రేషన్‌బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.