తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్దకల్​ మండలంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - jogulamba

జోగులాంబ గద్వాల జిల్లా  ఎస్పీ ఆదేశాల మేరకు మల్దకల్​ మండలంలోని మంగంపేట, నేతవానిపల్లి తండాలో  పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మెుత్తం 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలతో పాటు 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ విత్తనాల పట్టివేత

By

Published : Jun 22, 2019, 11:21 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్​ మండలంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మండలంలోని మంగంపేట, నేతువానిపల్లి తండాలో సాయంత్రం సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో సుమారు 60 మంది పోలీసులు పాల్గొన్నారు. మంగంపేటలోని ఇళ్లను తనిఖీ చేయగా 5 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. నేతువానిపల్లి తండాలోని ముదా వెంకటేష్ నాయక్ ఇంట్లో 14 క్వింటాలు, కృష్ణ నాయక్ ఇంట్లో 2క్వింటాల నకిలీ విత్తనాలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. మొత్తం 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అలాగే ఎలాంటి పత్రాలు లేని 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ విత్తనాల పట్టివేత

ABOUT THE AUTHOR

...view details