తెలంగాణ

telangana

ETV Bharat / state

'పంటలు వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి' - Niranjan reddy latest news

పంటలు వేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Plenary Meeting in manavapadu jogulamba gadwala district
Plenary Meeting in manavapadu jogulamba gadwala district

By

Published : Jun 11, 2021, 5:50 PM IST

అధికారులు, నాయకులు సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి తోడ్పడాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. పంటలు వేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఎరువులు విత్తనాలు అన్ని సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. సెగ్రీగేషన్ షెడ్లు, వైకుంఠ ధామలు, రైతువేదికలు, మొదలైన ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు.

పోలీసులను నిలదీసిన జడ్పీ ఛైర్​పర్సన్..

సర్వ సభ్య సమావేశంలో ఛైర్​పర్సన్ సరిత పోలీసులను నిలదీశారు. గత నెలలో మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో కల్తీ కళ్లు తాగి ముగ్గురు చనిపోయారు. దీనిపై పోలీసులు, నాయకులపై ఆరోపణలు రావడంతో 20రోజుల తరువాత పోలీసులు శవాలకు పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై ఛైర్​పర్సన్ సరిత పోలీసులను నిలదీశారు. చనిపోయిన వెంటనే స్పందించి ఉంటే ఈ విధంగా జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20రోజుల తరువాత ఎలా పోస్టుమార్టం చేస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్​పర్సన్ సరిత తెరాస కార్యకర్తలు, తదితరులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: కొత్త చట్టంతో అద్దెకు ఉండేవారికి మరిన్ని ప్రయోజనాలు!

ABOUT THE AUTHOR

...view details